PM Kisan 20వ విడత నిధుల విడుదల – రైతులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోట్లాది రైతులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) 20వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు అధికారికంగా విడుదల చేయనున్నారు.

ఏటా రూ.6 వేలు – మూడు విడతలుగా

పీఎం కిసాన్ పథకంలో రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6 వేలు అందజేస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా – ఒక్కోసారి రూ.2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇప్పటివరకు 19 విడతలుగా నిధులు పంపిణీ కాగా, ఈసారి 20వ విడత రూపంలో డబ్బులు అందించనున్నారు.

9.7 కోట్ల మంది రైతులకు రూ.20,500 కోట్లు

ఈ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.20,500 కోట్లు నేరుగా జమ కానున్నాయి. ఈ నిధులు అందుకోవడంతో రైతులు పండుగ వాతావరణంలో ఉన్నారు. రాష్ట్రాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు వేగంగా సాగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రైతు భరోసా నిధులను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే.

కేవైసీ పూర్తి చేసినవారికే నిధులు

పీఎం కిసాన్ నిధులు పొందడానికి కేవైసీ (KYC) తప్పనిసరి. ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయని వారు లేదా ఆన్‌లైన్ కేవైసీ పూర్తి చేయని వారు ఈ విడత నిధులు పొందలేరు. కాబట్టి రైతులు తమ KYC స్టాటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవాలి. సమస్యలు ఉంటే సమీప వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.

నిధులు వచ్చాయో లేదో ఎలా చెక్ చేయాలి?

రైతులు తమ ఖాతాలో పీఎం కిసాన్ నిధులు జమ అయ్యాయో లేదో ఈ కింది విధంగా తెలుసుకోవచ్చు:

  1. pmkisan.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  2. Farmers Corner విభాగంలోకి వెళ్లాలి.
  3. Beneficiary Status పై క్లిక్ చేయాలి.
  4. మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తే నిధుల స్టేటస్ తెలుస్తుంది.

📢 సూచన: పీఎం కిసాన్ పథకం, వ్యవసాయ సహాయ పథకాలపై మరిన్ని అప్‌డేట్స్ కోసం మా పోర్టల్‌ను ఫాలో అవ్వండి. నిధులు రాకపోతే వెంటనే మీ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయాన్ని సంప్రదించండి.

Speed Telugu