మోదీని పదవి నుంచి దింపేందుకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రయత్నం? – సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జరిగిన Congress Legal Conclave లో మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పదవి నుంచి తప్పించేందుకు ఆర్‌ఎస్‌ఎస్ యత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్‌ఎస్‌ఎస్ సూచన – 75 ఏళ్లు దాటితే పదవులకు గుడ్‌బై?

సీఎం రేవంత్ మాట్లాడుతూ – “ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75 ఏళ్లు దాటిన వారు పదవులు వదిలేయాలని సూచించారు. ఇదే నిబంధన గతంలో ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి లకు వర్తింపజేశారు. అయితే మోదీ గారికి ఇది ఎందుకు వర్తించడం లేదు?” అని ప్రశ్నించారు.

“మోదీని కుర్చీ నుంచి దింపేది రాహుల్ గాంధీ మాత్రమే”

రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ – “మోదీని పదవి నుంచి తప్పించడం ఆర్‌ఎస్‌ఎస్ లేదా బీజేపీ వల్ల కాదు. అది కేవలం రాహుల్ గాంధీ వల్లే సాధ్యం” అని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే సంకల్పం

సీఎం రేవంత్, దేశంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోందని, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుందని తెలిపారు.
తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తున్నట్లు చెప్పారు.

కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల మధ్యే

సీఎం అభిప్రాయం ప్రకారం – “కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉంటుంది. కానీ ఇతర పార్టీలు గెలిస్తే అధికారంలో ఉంటాయి, ఓడితే ఇంట్లో కూర్చుంటాయి” అన్నారు.

స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ – రాజ్యాంగ రక్షణలో కట్టుబాటు

రేవంత్ రెడ్డి – “దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్. బీజేపీ, బీఆర్‌ఎస్, బీజేడీ, ఆర్జేడీ వంటి పార్టీలు అన్నీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాతే పుట్టాయి. ప్రస్తుతం మోదీ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది” అని విమర్శించారు.

Speed Telugu